అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద హైటెన్షన్.. (వీడియో)

అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద హైటెన్షన్.. (వీడియో);

By :  Ck News Tv
Update: 2025-03-10 07:13 GMT

అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద హైటెన్షన్.. (వీడియో)

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై అర్ధరాత్రి గాంధీభవన్ వద్ద మైనారిటీ నేతల నిరసన వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి 2 గంటలకు గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ముస్లిం నేతలు ఆందోళన నిర్వహించారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం నిన్నటి వరకు వివిధ సమాజిక వర్గాలకు చెందిన నేతలు ధీమాతో ఉన్నారు.

అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. ఇందులో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి చోటు దక్కగా.. సీపీఐ నుంచి నెల్లికంట్ల సంత్యంకు అవకాశం దక్కింది.

Full Viewఅయితే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో ముస్లిం మైనార్టీ నేతలకు చోటు దక్కకపోవడంతో మైనార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై అర్ధరాత్రి గాంధీభవన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న మైనారిటీ నేతల నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ముస్లిం నేతలు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో వారు మాట్లాడుతూ..ముస్లిం నాయకులను కావాలనే పక్కన పెట్టారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 14% ముస్లిం జనాభా ఉన్నప్పటికి.. కాంగ్రెస్ పార్టీ ఒక్క ముస్లిం అభ్యర్థికీ అవకాశం ఇవ్వలేదని మైనార్టీ నేతలు మండిపడ్డారు.

ఈ క్రమంలో వారి ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. నిరసనకారులను అదుపులోకి తీసుకుని బేగంబజార్, ముషీరాబాద్ స్టేషన్లకు తరలించారు.

Similar News