మైనారిటీ యువతిపై,, పెట్రోల్ పోసిన యువకుడు
మైనారిటీ యువతిపై,, పెట్రోల్ పోసిన యువకుడు;
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీ వద్ద ప్రధాన రహదారి పక్కనే నిలబడి ఉన్న ఓ మైనారిటీ యువతిపై,, పెట్రోల్ పోసిన యువకుడు...
ముందుగా తాను పెట్రోల్ పోసుకొని. తర్వాత మహిళపై పెట్రోల్ పోసి బెదిరించిన యువకుడు..
గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ కు పంపించడం జరిగింది...
ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన ఓ యువతి పట్టణంలోని ఆమె మేనమామ ఇంట్లో ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
ఆ యువతితో పరిచయం ఉన్న ఆమె స్వగ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చింది.
కోదాడ రోడ్డులో ఉన్న ఓ దుకాణం ఎదుట మాట్లాడుతుండగా తనను ఎందుకు ప్రేమించడం లేదని యువతితో గొడవపడిన ప్రమోద్ కుమార్ పెట్రోల్ పోశాడు.
గమనించిన స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు పట్టించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.