ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ పై కేసు నమోదు...

By :  Ck News Tv
Update: 2025-02-15 04:11 GMT

*డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ పై సూర్యాపేటలో పోలీస్ కేసు...*

*భూకబ్జా, కుట్ర, దాడులకు ఎమ్మెల్యే పురమాయించినట్లు పోలీసుల అభియోగం...*

*సూర్యాపేట భూమి విషయంలో సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ : 18/2025 తేది : 12-1-2025 న కేసు నమోదు.*

*A1 గా బాశపంగు బాస్కర్, A2 ఎమ్మెల్యే జాటోత్ రామ చంద్రు నాయక్ తోపాటు మరో 9 మందిపై పోలీస్ కేసు*

*భారతీయ న్యాయ సంహిత - 2023 సెక్షన్ 189(2), 329(3), 352, 351(2) ప్రకారం కేసు నమోదు...*

*తన భూమిని గుండపనేని లక్ష్మి నరసింహారావు @ సుధాకర్ రావు కబ్జా చేస్తున్న సూర్యాపేట పోలీసులు సహకరించడం లేదంటూ హైకోర్టు మెట్లు ఎక్కిన ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్*

*డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ కు సూర్యాపేట పోలీస్ లు సహకరించడం లేదని WP no : 3229/2025 పిటిషన్ వేసారు.*

*భూ కబ్జా, భూ అసలు దారులను బెదిరించి, ఒక వ్యక్తిని కొట్టి చంపుతా అని బెదిరింపులకు దిగినట్లు సూర్యాపేట పోలీసులు కౌంటర్ అఫిడవిట్*

*ఒక పోలీస్ కేసులో నిందితుడుగా ఉండి, పోలీస్ వారిపై అభియోగం చేయడంపై హోం శాఖ పోర్టు పోలియో జడ్జి జస్టిస్ బి.విజయ సేన్ రెడ్డి సుదీర్ఘ పరిశీలన*

*మా భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తూ... ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని ప్రశాంత వాతావరణాన్ని అశాంతి పలు చేస్తున్నాడని తెలంగాణా హైకోర్టుకు ఆ కేసులో ఇంప్లీడ్ అయిన భూ హక్కు దారు గుండపనేని లక్ష్మి నరసింహారావు @ సుధాకర్ రావు*

*హైకోర్టు కేసు తదుపరి విచారణ 25 ఫిబ్రవరి రోజుకు వాయిదా.*

*హైకోర్టు కేసులో సూర్యాపేట ఎస్పీ, డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, గుండపనేని లక్ష్మి నరసింహారావు @ సుధాకర్ రావు ప్రతి వాదులు.*

*సూర్యాపేట పట్టణంలో తనకున్న 50 గుంటల భూమి సర్వే నెంబర్ : 232లోని భూమిని డోర్నకల్ ఎమ్మెల్యే డా.జాటోత్ రామ చంద్రు నాయక్ తరచుగా కబ్జా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రతివాది గుండపనేని లక్ష్మి నరసింహారావు @ సుధాకర్ రావు వెల్లడి...*

*భూ కబ్జాకు సంబందించిన అన్ని ఆదారాలు, వీడియో, ఫొటోస్ హై్కోర్టుకు సమర్పించిన సూర్యాపేట పోలీసులు...*

Similar News