నువ్వు మంత్రి అయితే మాకేంది?.. సీతక్కకు చేదు అనుభవం
నువ్వు మంత్రి అయితే మాకేంది?.. సీతక్కకు చేదు అనుభవం;
నువ్వు మంత్రి అయితే మాకేంది?.. సీతక్కకు చేదు అనుభవం
తెలంగాణ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎక్కడికి వెళ్లినా వారికి ఇటీవల కాలంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రజలు తమకు ఇచ్చిన హామీల సంగతేంటని నిర్మోహమాటంగా ప్రశ్నిస్తున్నారు.దీనికి తోడు దేవాలయాల్లో ప్రొటోకాల్ పేరిట తమను ఎంతసేపు వెయిట్ చేయిస్తారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. 'నువ్వు మంత్రివైతే మాకేంది, నువ్వు దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఎంతసేపు ఆపుతావు.. అని సీతక్కను భక్తులు నిలదీశారు.శుక్రవారం ఉదయం మేడారం దర్శనానికి వెళ్లిన సీతక్క కోసం భక్తులను గంటల తరబడి అధికారులు క్యూ లైన్లలో నిలిపివేశారు. దీంతో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'నువ్వు మంత్రివైతే మాకేంది, నువ్వు దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఎంతసేపు ఆపుతావు' అని కొందరు భక్తులు ఫైర్ అయ్యారు.