తెలంగాణ సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి

తెలంగాణ సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి;

By :  Admin
Update: 2025-02-07 00:33 GMT

తెలంగాణ సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి

గత కొన్ని రోజులుగా తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు కలకలం రేపుతున్నారు. ఇవాళ మరో నకిలీ ఉద్యోగిని సచివాలయ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.

ఫేక్‌ ఐడీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించిన నకిలీ ఉద్యోగిని గుర్తించిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తహశీల్దార్‌ పేరుతో కొంపల్లి అంజయ్య సచివాలయంలోకి వెళ్లాడు. అయితే అతనిపై అనుమానం రావడంతో అధికారులు విచారించి.. ఫేక్ ఐడీ కార్డుతో వచ్చాడని గుర్తించారు. సైఫాబాద్‌ పోలీసులకు అంజయ్యను అప్పగించారు.

కాగా, కేటుగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొత్త అవతాలు ఎత్తుతున్నారు. గత వారం.. సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటరియేట్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆ ప్రెస్‌మీట్‌ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు.

తనిఖీ చేసే సమయంలో తాను రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు హాజరయ్యాడు. భాస్కర్‌ రావు ఐడీపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిన సంతి తెలిసిందే. భాస్కర్‌ ప్రభుత్వ ఉద్యోగి కాదని, మైనార్టీ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News