రసమయి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా
రసమయి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా;
రసమయి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసత్యపు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని నిరసిస్తూ బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఈ మేరకు టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణతో పాటు పలువురు నాయకులు బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని రసమయి ఫామ్‌హౌస్ ముట్టడికి యత్నించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న రసమయి గుండారం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అక్రమాలు జరిగినట్లయితే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేయగా ఇప్పటివరకు స్పందించలేదని ఎద్దేవా చేశారు.
ఫామ్‌హౌస్ ముట్టడి విషయం తెలుసుకున్న పోలీసులు గుండారం మండల కేంద్రంలోనే కాంగ్రెస్ లీడర్లను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
నిరసనలో మండల, బ్లాక్ అధ్యక్షులు నందగిరి రవీంద్ర ఆచారి, ముక్కిస రత్నాకర్‌రెడ్డి, వీరంపల్లి రమణారెడ్డి, గోపగోని బసవయ్య, భూంపల్లి రాఘవరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ అలవాల కోటి, ఏఎంసీ వైస్‌చైర్మన్ చిలువరి శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ చైర్మన్ జిల్లా ప్రభాకర్, డైరెక్టర్ బండిపెల్లి రాజు, మచ్చ కుమార్ పాల్గొన్నారు.