లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిపిఓ,పంచాయతీ కార్యదర్శి
వెంచర్ మేనేజర్ నుంచి రూ.2 లక్షలు తీసుకున్న డీపీవో, పంచాయతీ కార్యదర్శి;
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిపిఓ,పంచాయతీ కార్యదర్శి
వెంచర్ మేనేజర్ నుంచి రూ.2 లక్షలు తీసుకున్న డీపీవో, పంచాయతీ కార్యదర్శి
ఓ వెంచర్ యజమానుల నుంచి రెండు లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం పరిధిలోని గ్రామపంచాయతీ శివారులో జాతీయ రహదారికి పక్కన అన్నపూర్ణ గ్రీన్ హిల్స్ వెంచర్ ఏర్పాటు కోసం అనుమతులు ఉన్నాయి. కానీ ఆ వెంచర్ లో గ్రామపంచాయతీకి తనక పెట్టిన ప్లాట్లను పంచాయతి అనుమతిలేకుండా సబ్ రిజిస్ట్రార్ అధికారుల సహకారంతో వెంచర్ యజమాని ఓ బిల్డర్ కు రిజిస్ట్రార్ చేశాడు.
దీనిపై కొందరు జిల్లా డిపిఓ కు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు ఆధారంగా జిల్లా డిపిఓ శ్యాంసుందర్ సెక్రటరీ చేత ఆ వెంచర్ యజమానికి నోటీసులు ఇప్పించారు. ఇచ్చిన నోటీసులపై చర్యలు లేకుండా ఉండేందుకు యజమానులు పంచాయతీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిపిఓ,పంచాయతీ కార్యదర్శిసెక్రటరీని ఆశ్రయించారు.
డిపిఓ శ్యాంసుందర్ తో కలిసి మూడు లక్షల రూపాయలు ఇస్తే ఇచ్చిన నోటీసులపై చర్యలు ఉండవని ఆక్షేపించారు. రెండు లక్షలకు బేరం కుదుర్చుకున్న వెంచర్ యజమానులు మొత్తం నగదును శుక్రవారం మధ్యాహ్నం ఉండవెల్లి మండల పరిధిలోని బూడిదపాడు గ్రామ శివారులోని ఓ వెంచర్ లో డిపిఓ శ్యాంసుందర్ కు పంచాయతీ సెక్రెటరీ ద్వారా ఇచ్చేందుకు వెళ్లారు. పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి చేతికి నగదు ముట్టిన వెంటనే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.
నగదులో డిపిఓకి వాట ఉండడంతో పట్టుబడ్డ పంచాయతీ సెక్రటరీతోనే డిపిఓకి ఫోన్ ద్వారా నగదు ముట్టినట్లు సమాచారం అందించి అప్పటికే ఏసీబీ ట్రాప్ లో ఉన్న డిపిఓను కూడా అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. అనంతరం ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి గద్వాల డిపిఓ కార్యాలయంలో సైతం సోదాలను నిర్వహించారు. నగదు పట్టుబడిన చోటు నుంచి పంచాయతీ సెక్రెటరీని గద్వాల జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లి డిపిఓ కార్యాలయంలో ఇద్దరిని ఒకే చోట ఉంచి విచారణ నిర్వహిస్తున్నారు.