నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు;

By :  Ck News Tv
Update: 2025-03-21 07:13 GMT

నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకుతోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అయితే, బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది,రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం ప్రభా వంతో రానున్న రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గి వాతావ రణం చల్లబడుతుందని పేర్కొంది.

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవ కాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం పది జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వడగండ్లు పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది.

Full View

ఇదిలా ఉంటే.. ఇవాళ అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు, శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.

ఈ జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు.. వడగండ్ల వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

*

Similar News