ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన సర్పంచులు

ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన సర్పంచులు;

By :  Ck News Tv
Update: 2025-03-28 09:58 GMT

ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన సర్పంచులు

ఆసిఫాబాద్ : జిల్లాలోని కాగజ్ నగర్ ఎంపీడీవో (MPDO)కార్యాలయానికి గురువారం సర్పంచులు తాళం వేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నామని, అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.

Full View

గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు , మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామపంచాయతీకి రావలసిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Similar News