హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద మళ్లీ ఉద్రిక్తత...
విద్యార్థి నాయకుల అరెస్ట్;
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద మళ్లీ ఉద్రిక్తత...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్ సీయూ) భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం ఆందోళన చేపట్టింది. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ గత రాత్రి(శనివారం) నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
దాంతో యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించి ఆందోళనను అణిచివేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు'(ఆదివారం) యూనివర్శిటీ పరిధిలోని పచ్చచెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకుంది.
వర్శిటీ పక్కన ఉన్న భారీ స్థలంలో చెట్లను కొట్టివేస్తుండగా విద్యార్ధులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీ మెయిన్ గేటుకు తాళం వేశారు పోలీసులు. యూనివర్శిటీ ప్రాంగణంలో జేసీబీలతో చెట్లను కూల్చివేసి నేలను చదును చేసే యత్నం చేస్తున్నారు.
విద్యార్థులు అరెస్టు..ఎస్‌ఎఫ్‌ఐ ఖండన
ఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆందోళనను అణచివేసే క్రమంలో పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఎస్ఎఫ్ఐ ఖండించింది. అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది.