KhammamTelangana

డబ్బుల కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..

డబ్బుల కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..

ఖమ్మం నగరంలో దారుణం

కన్నతల్లిని కొట్టిచంపిన కుమారుడు..

ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామన్నపేటలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు డబ్బుల కోసం కన్న తల్లినే కిరాతకంగా హత్య చేశారు.
శనివారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. రామన్నపేటకు చెందిన శ్రవణ్‌ కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తల్లిదండ్రులు ఎంతగా చెప్పిన తన తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో శనివారం నాడు తల్లి రామలక్ష్మి(55)ను డబ్బుల కోసం వేధించాడు. ఈ క్రమంలోనే ఆమెను కొట్టి చంపాడు.

అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, ఇంటికి వచ్చి చూసిన తండ్రికి రామలక్ష్మీ అనుమానాస్పదంగా మృతిచెంది ఉండటం కనిపించడంతో విషాదంలో మునిగిపోయాడు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

తన కుమారుడే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి శ్రవణే తన తల్లిని కొట్టి చంపాడని నిర్ధారించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button