PoliticalTelangana

నా చావుకు కారణం వారే.. వీవోఏ సూసైడ్ నోట్ లో నమ్మలేని నిజాలు

నా చావుకు కారణం వారే.. వీవోఏ సూసైడ్ నోట్ లో నమ్మలేని నిజాలు

నా చావుకు కారణం వారే.. వీవోఏ సూసైడ్ నోట్ లో నమ్మలేని నిజాలు

పాపన్నపేట : ఉరి వేసుకొని వీవోఏ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని పొడ్చన్ పల్లిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.

ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన అక్కల పద్మ(48) గత కొన్నేళ్ల నుంచి పొడ్చన్ పల్లి స్వయం సహాయక సంఘ వీవోఏగా పని చేస్తుంది.
ఈ క్రమంలో పద్మ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ముందు ఓ కాగితం పై కొందరి పేర్లు రాసినట్లు సమాచారం.

స్వయం సహాయక సంఘాల రుణాల సంబంధిత శాఖ అధికారులు, ఇద్దరు బ్యాంకు అధికారులు, సీసీ, మరో వీవోఏ తనను బెదిరించి డబ్బులు విత్ డ్రా చేశారని, వారు ఆర్థికంగా లబ్ధి పొంది తనపై నేరం మోపుతున్నారని రాశారు.

ఈ మనోవేదనతో చనిపోతున్నానని అందులో పేర్కొంది. తన తల్లి మృతికి కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని కొడుకు నవీన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button