KhammamTelangana

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..

ఖమ్మం రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న గుడిమల్ల చార్లెస్ (అలియాస్) కృష్ణ

మే 26 ఖమ్మం నగరం బల్లెపల్లి ప్రాంతానికి చెందిన గుడిమల్ల చార్లెస్ (అలియాస్) కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతూ మధ్యనికి బానిసై ఆరోగ్యం సహకరించక తన బాధను భరించలేక నిన్న సాయంత్రం రైల్వే స్టేషన్ కి వెళ్లి ప్లాట్ఫారం మీద నిలబడి రైల్ ఇంజన్ దగ్గరకు వెళ్లి కదులుతున్న సమయంలో తలని రైల్వే ట్రాక్ మీద పడుకొని ఉండగా దూసుకు వచ్చిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే గుడిమల్ల చార్లెస్ అలియాస్ కృష్ణ సొంత గ్రామం రెబ్బవరం ప్రైవేటు ఉద్యోగం కోసం బల్లెపల్లి ప్రాంతానికి వచ్చి కొంతకాలం ఓ ప్రైవేట్ పాఠశాలలో డ్రిల్ మాస్టర్ గా పనిచేసే, స్కూలులో ఉద్యోగం విరమించి కుటుంబ అవసరాల కోసం పెయింటింగ్ వృత్తిని నమ్ముకొని కొంతకాలం జీవనం సాగించి మద్యానికి బానిసై ఆరోగ్యం సహకరించక నిన్న రైలు ప్రమాదంలో మరణించాడు

మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం అనంతరం అన్నం శ్రీనివాసరావు వాహనంలో మృతదేహాన్ని రెబ్బవరం తన సొంత గ్రామానికి మృతదేహాన్ని తరలించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button