HyderabadPoliticalTelangana

ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..

ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..

ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో తీవ్ర ఉద్రిక్తత..

144 సెక్షన్ అమలు..

తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైనూర్ మండలం లో ఆదివాసీ మహిళపై ఓ వర్గానికి చెందిన వ్యక్తి లైంగిక దాడి జరిపి హత్య యత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆదివాసీ సంఘాలు వారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు.

ఈ క్రమంలో రెండు ఆదివాసీలు మరో వర్గం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివాసులకు మద్దతుగా ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీష్ బాబు జైనూర్ వెళ్లనున్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు.

వారం రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న జైనూర్ లో ఈ రోజు పరిస్థితులు ఉదృతంగా మారాయి. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నెట్ వర్క్ ను సైతం తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జైనూర్ ఏజెన్సీలో దాదాపు 1000 మంది పోలీసులు సహారా కాస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button