PoliticalsuryapetaTelangana

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు.మూడు నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ఇస్తామని కూడా ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఇక అటు తెలంగాణ రాష్ట్రం లో పెన్షన్లకు కత్తెర పడబోతుంది. పాత పెన్షన్ల కోత కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పెన్షన్లు ఎగిరిపోవడం ఖాయం అని తేల్చారు మంత్రి పొంగులేటి. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవ్వా తాతల గుండెల్లో ఆందోళన నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button