Hyderabad
Trending

లంచం ఇవ్వకుంటే నీ భార్యను కూడా అరెస్ట్‌ చేస్తాం.. సీఐ మహేందర్‌ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

లంచం ఇవ్వకుంటే నీ భార్యను కూడా అరెస్ట్‌ చేస్తాం.. సీఐ మహేందర్‌ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

లంచం ఇవ్వకుంటే నీ భార్యను కూడా అరెస్ట్‌ చేస్తాం.. సీఐ మహేందర్‌ కేసులో వెలుగులోకి కీలక విషయలు
ఇటీవల సైబర్ క్రైమ్ బ్యూరో సీఐ మహేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్ – నాంపల్లిలోని సైబర్ క్రైమ్ బ్యూరోలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా..
బాధితుల నుంచి రూ.2 లక్షల డబ్బులు తీసుకుంటూ సీఐ మహేందర్ ఏసీబీకి చిక్కాడు. కాగా సీఐ మహేందర్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లంచం ఇవ్వకపోతే నీ భార్యను కూడా అరెస్ట్‌ చేస్తామని.. మా ఏసీపీ కూడా రూ.30 లక్షలు అడుగుతున్నాడని సీఐ మహేందర్ బాధితుడిని డిమాండ్ చేసినట్టు తేలింది.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వందల కోట్ల సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ అయ్యి ఖమ్మం జైలులో ఉండగా.. సీఐ మహేందర్ మరో కేసులో పీటీ వారెంట్ తీసుకుని చంచల్ గూడ జైలుకు తరలించాడు. సీఐ మహేందర్‌ నిందితుడి తండ్రికి ఫోన్ చేసి, నీ కొడుకుని మరికొన్ని కేసుల్లో అరెస్ట్ చేయాల్సి వస్తుందని బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు నిందితుడు బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత నీ భార్య ఫోన్ నుండి వేరే నిందితుడికి డబ్బు బదిలీ అయిందని, ఆమెను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుందని రూ.7 లక్షలు ఇవ్వాలని సీఐ మహేందర్ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.

సీఐ మహేందర్ ఏసీపీ కూడా రూ.30 లక్షలు అడుగుతున్నాడని, తోటి సీఐ శ్రీను కూడా డబ్బులు అడుగుతున్నాడని తెలుపడంతో.. అప్పటికే తన భార్య 5 నెలల బాలింతగా ఉండడంతో నిందితుడు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించి సీఐ మహేందర్‌కు విడతల వారిగా రూ.3 లక్షలు చెల్లించినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మరో రూ.4 లక్షలు కూడా ఇవ్వాలని సీఐ మహేందర్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో సదరు నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నిందితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సీఐ మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button