Khammam

సంక్షేమమైనా… సహాయమైనా పొంగులేటి ముందంజ

సంక్షేమమైనా… సహాయమైనా పొంగులేటి ముందంజ

సంక్షేమమైనా… సహాయమైనా పొంగులేటి ముందంజ

ఖమ్మం : సంక్షేమమైనా… సహాయమైనా అందించడంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముందంజలో ఉంటారని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బారుగూడెం, గొల్లగూడెం, ఏదులాపురం, వరంగల్ క్రాస్ రోడ్డు, మద్దులపల్లి, జలగంనగర్, నాయుడుపేట, కేబీఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, రెడ్డిపల్లి, ముత్తగూడెం ప్రాంతాల్లో ఇటీవల మృతి చెందిన 20మంది వ్యక్తుల కుటుంబాలను ఓదార్చి పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రిగా ఒకవైపు ప్రభుత్వం తరుపున సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరిచేర్చుతూనే.. ఇంకోవైపు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథబాబు, బాణోతు కిశోర్, భూక్యా సురేష్ నాయక్, బండి జగదీశ్, అజ్మీరా అశోక్ నాయక్, వెంపటి రవి, తమ్మినేని నవీన్, కందుకూరు వెంకట నారాయణ, యాకుబ్, తిప్పిరెడ్డి వీరా రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మహేశ్ , బానోతు దివ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బారుగూడెంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమంలో దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button