
బాలికతో అసభ్యకర ప్రవర్తన..కీచక టీచర్‌కి దేహశుద్ధి
వికారాబాద్ జిల్లాలో ఓ కీచక టీచర్ బాగోతం బయటపడింది. కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కంప్యూటర్కోర్స్నేర్చుకోవడానికి వికారాబాద్‌జిల్లా కేంద్రంలోని బ్రెయిన్ ట్రీ కంప్యూటర్ట్రైనింగ్సెంటర్కు వెళ్తోంది. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా వెళ్లింది.
సెంటర్నిర్వాహకుడు నవాజ్ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది.
ఆగ్రహంతో వారు కంప్యూటర్ సెంటర్‌కు వచ్చి నవాజ్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.