BhadrachalamPoliticalTelangana

భద్రాచలంలో అడుగుపెట్టనివ్వం.. ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

భద్రాచలంలో అడుగుపెట్టనివ్వం.. ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

భద్రాచలంలో అడుగుపెట్టనివ్వం.. ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మండిపడ్డారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే భద్రాచలంలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.

బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. రాజకీయ అనుభవం లేని ఎమ్మెల్సీ తాతా మధుకు నన్ను విమర్శించే స్థాయిలేదని, ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ నిధులతో నియోజవర్గాన్ని అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు.

భద్రాచలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నా రాజకీయ గురువు అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తెల్లం వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

పార్టీ మారిన తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు పై విధంగా ఎమ్మెల్యే తెల్లం కౌంటర్ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button