Andhra PradeshPoliticalTelangana

ఏపీ PCC చీఫ్‌గా వైఎస్ షర్మిల ?

ఏపీ PCC చీఫ్‌గా వైఎస్ షర్మిల ?

ఏపీ PCC చీఫ్‌గా వైఎస్ షర్మిల ?

అమరావతి : డిసెంబర్ 26
తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు ఏపీపై కన్నేసింది.

ఈ క్రమంలోనే ఈ నెల 27న ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనుంది. అధ్య క్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్‌ ఏపీ నేతలతో భేటీ కానున్నారు.

ఈ సమావేశంనికి తప్పక హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.

వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలపై ఈ భేటీలో కీల కంగా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా..ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాదు..ఈ నూతన సంవత్సరం రోజునే దీనిపై అధి కారిక ప్రకటన వెలువను న్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో గతంలో షర్మిల చర్చలు జరిపారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయ డానికి కూడా సిద్ధమయ్యారు.

అయితే, ఆమె సేవలను అధిష్టానం ఏపీలో వాడు కోవాలని చూడగా..షర్మిల మాత్రం తెలంగాణ రాజ కీయాలపై ఆసక్తి కన బర్చారు.

ఏపీలో వైఎస్‌ఆర్‌కు ఉన్న క్రేజ్‌‌ను వాడుకొని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిలకు పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలవడాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button