KhammamKusumanchiPoliticalTelangana

రాజుపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజుపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజుపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

సికే న్యూస్ ప్రతినిధి కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాజపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మరియు ప్రధాన కూడలిలో వేడుకలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నివాళులర్పించిన ప్రముఖులు .ఈ కార్యక్రమానికి గౌరవ సర్పంచ్ భానోత్ మహేష్ మరియు ఉప సర్పంచ్ సోలిపురం ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో గ్రామ పంచాయతీ బృందం మరియు గ్రామ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వార్డు సభ్యులు: రాజుల రాములు, షేక్ జానిమియా, కిన్నెర మహేష్, అబ్బనపూర్ లక్ష్మి, బానోత్ దేశిరం, కోట అశ్విని. అధికారులు, పంచాయతీ సెక్రెటరీ ముత్తారావు , గ్రామ పెద్దలు, కందాల కమలాకర్ రెడ్డి, తూముల శీను, షేక్ జానీ, కిన్నెర నర్సయ్య, సండ్ర వెంకన్న, సబు దర్గయ్య, ఉప్పల పేరయ్య. కార్యక్రమంలో గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని “జై భీమ్” నినాదాలతో హోరెత్తించారు. అనంతరం గ్రామంలో మిఠాయిలు పంపిణీ చేసి పండుగ వాతావరణంలో జయంతిని జరుపుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button