Andhra PradeshPolitical

మాజీ మంత్రి బాడీగార్డ్‌ పై హత్యాయత్నం

మాజీ మంత్రి బాడీగార్డ్‌ పై హత్యాయత్నం

మాజీ మంత్రి బాడీగార్డ్‌ పై హత్యాయత్నం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌ పై మంగళవారం అర్థరాత్రి దాటిన సమయంలో హత్యాయత్నం జరిగింది.
అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్‌ నిలుచుని ఉండగా.. కారుతో దుండగులు బాడీగార్డ్‌ను ఢీకొట్టారు.

ఆ తరువాత ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో అతడిపై దాడి చేశారు. వెంటనే నిఖిల్‌ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు.

తీవ్రగాయాలతో ఉన్న అతడిని వెంటనే నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. గతంలో నంద్యాలలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్‌ దాడి చేశాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button