Andhra PradeshPoliticalTelangana

సింగయ్య మృతి పై షర్మిల ఫైర్

సింగయ్య మృతి పై షర్మిల ఫైర్

సింగయ్య మృతి పై షర్మిల ఫైర్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైకాపా బలప్రదర్శనలకు, హత్యలకు జగన్‌ ఏం సమాధానం చెబుతారంటూ ‘ఎక్స్‌’ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

”కారు కింద పడ్డారని చూడకుండా కాన్వాయ్‌ కొనసాగించడం ఏంటి? వందమందికి పర్మిషన్‌ ఇస్తే వేలమంది ముందు జగన్‌ చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? బెట్టింగ్‌లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా? ఇదేం రాజకీయం..

ఇదెక్కడి రాక్షస ఆనందం. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాలతో శవ రాజకీయాలు చేస్తారా? కారు సైడ్‌ బోర్డ్‌ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్‌ మూవ్‌ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్‌ బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోంది.

బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి జగన్‌ కారణమయ్యారు. పర్మిషన్‌కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఎందుకు నిద్ర పుచ్చారు? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్‌ అరెస్ట్‌లు చేస్తారు. దీక్షలు భగ్నం చేస్తారు.

ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైకాపా చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెబుతారు? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?” అని షర్మిల ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button