
వృద్ధాప్యంలో బ్రతుకు కొంసం జీవన పోరాటం,
జూలై 09 (సీ కే న్యూస్) చేగుంట
చేగుంట మండల కేంద్రంలో కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గొడుగుపల్లి గ్రామానికి చెందిన నర్సవ్వ అనే వృద్ధురాలు నిరుపేదరికంతో మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.
భర్త చనిపోవడంతో ఒంటరిదైన ఆమె, కుటుంబ పోషణ కోసం రోడ్డు పక్కన మక్క బుట్టలు కాలుస్తూ బతుకుదెరువు వెతుక్కుంటోంది. ఆమెకు ఒక కూతురు ఉండగా, ఆమె కూడా మక్క బుట్టలు అమ్ముకుంటూనే జీవితాన్ని నెట్టుకొస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబం నిత్యం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది.
చేగుంట గాంధీ విగ్రహం వైపు వచ్చే ప్రజలు, వాహనదారులు ఎవరైనా చిన్న చిన్న తినుబండారాలు కొనాలనుకుంటే.. ఈ నిరుపేద తల్లి, కూతుళ్ల దగ్గరే కొనుగోలు చేసి వీరికి ఆర్థికంగా కొద్దిగా సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మనమిచ్చే చిన్న ప్రోత్సాహం వారి కుటుంబానికి పెద్ద కొండంత అండగా నిలుస్తుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




