PoliticalsuryapetaTelangana

ప్రపంచంలో పూలను పూజించే పండుగ బతుకమ్మ

ప్రపంచంలో పూలను పూజించే పండుగ బతుకమ్మ

ప్రపంచంలో పూలను పూజించే పండుగ బతుకమ్మ

కోతి సాయి శరణీరెడ్డి

మహిళలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ

మాజీ ఎంపీపీ పార్వతి కొండా నాయక్

తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబరాలు

గ్రామాల్లో ఆటపాటలతో మహిళల సందడే సందడి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 02

ప్రపంచంలో పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అని కోతి సాయి శణీరెడ్డి పార్వతి కొండా నాయక్ లు అన్నారు.

ప్రపంచ నలుమూలల బతుకమ్మ పండుగకు మంచి ఆదరణ మహిళల్లో ఉన్నదని దానిలో భాగంగానే హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో సంబరాలు ప్రారంభమయ్యాయని తెలంగాణలో బతుకమ్మ పండుగ రానే వచ్చేసిందని పల్లెలు పట్నాలు ఉయ్యాల పాటలతో మార్మోగనున్నా యి, తెలంగాణ ఆడపడు చులు ఆటపాటలతో అంగరంగా వైభవంగా జరుపుకుంటారని తీరొక్క పూలతో సాగే వేడుకను 9 రోజులపాటు నిర్వహిస్తారు.

పెత్తర అమా వాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై ఈనెల 10న సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణ సంస్కతికి చిహ్నం బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో ప్రతి గ్రామం శోభాయమానంగా మారిపోతుంది.

ప్రపంచంలో పూలను పూజించే అరుదైన పండుగ ఇది. జీవితమంతా సంతో షంగా సాగిపోవాలనేది బతుకమ్మ పండుగ ఆంత ర్యం. గునుగుపూలు తంగేడుపూలు , పట్టుకుచ్చు, బంతి, చామంతి,వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు.

సాయంత్రం ఇంటి ముందు,సమీపంలో ఉన్న దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలంతా గుమిగూడి పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు.
బతుకమ్మలను చెరువులలో కుంటలలో సాగనంపిన తర్వాత నువ్వులు, బియ్యం, పల్లీల తో చేసిన సత్తు ముద్దలను మహిళలు నైవేద్యంగా భావించి ఒకరికొకరు వాయినం ఇచ్చిపుచ్చు కుంటారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button