Uncategorized

రిపోర్టర్ నాగరాజు కు 5000 రూపాయలు నగదు, బియ్యం అందజేత...

రిపోర్టర్ నాగరాజు కు 5000 రూపాయలు నగదు, బియ్యం అందజేసిన
టీజేయు జిల్లా అధ్యక్షుడు షానూర్

సి కె న్యూస్ ఆత్మకూర్ ఎం రిపోర్టర్ షేక్ అజీజ్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని తుక్క పురం గ్రామానికి చెందిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆత్మకూరు మండలం అధ్యక్షులు గడ్డం నాగరాజు తండ్రి గడ్డం మురళి దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబా మరియు జిల్లా కమిటీ సభ్యులతో కలిసి వెళ్లారు. అనంతరం వారి
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షానూర్ మరియు జిల్లా కమిటీ చేతులమీదుగా రిపోర్టర్ నాగరాజుకు 5000 రూపాయలు నగదు మరియు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.

అనంతరం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులకు ఏ ఒక్కరికి ఆపద వచ్చినా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,జిల్లా కార్యదర్శి గుర్రాల నాగరాజు,జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ,జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లేష్ ,జిల్లా సహాయ కార్యదర్శి నోముల రవీందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్, షేక్ అజిజ్ ,మండల కార్యదర్శి మేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button