HyderabadPoliticalTelangana

MLC కవిత అరెస్ట్..

MLC కవిత అరెస్ట్..

MLC కవిత అరెస్ట్..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులతో కలిసి కవిత ధర్నా చేపట్టారు.

హైడ్రా బుల్డోజర్లు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ బైఠాయించారు కవిత. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కవితతో పాటు పలువురు జాగృతి నాయలకును అరెస్ట్ చేసి.. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బలప్రయోగంతో అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు.

మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతున్నారంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని.. దానినే కాంగ్రెస్ కొనసాగిస్తోందని విమర్శించారామె.

పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు కవిత. మూసీ రివర్ బెడ్‌లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన కవిత.. వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చేసినందుకు ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. హైడ్రా బుల్డోజర్లు ఇక్కడికి వస్తేనే.. రంగనాథ్ స్పందించి చర్యలు తీసుకుంటేనే.. ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని తాము భావిస్తామని అన్నారు.

ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్న అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నదన్నారు. అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుందని కవిత ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button