EducationHyderabadNotificationPoliticalTelangana

బర్రెలక్క, ఆమె భర్త అరెస్ట్... లాక్కెళ్ళిన పోలీసులు

బర్రెలక్క, ఆమె భర్త అరెస్ట్… లాక్కెళ్ళిన పోలీసులు

మరోసారి తెరపైకి బరెలక్క…

సోషల్ మీడియా స్టార్, ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా టీజీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద ఆమె దర్నాకు దిగగా పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్ట్ చేశారు.

నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయవద్దంటూ ఆమె నినాదాలు చేస్తుండగా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బలవంతంగా జీపులో తరలించారు. ఆమెతో పాటుగా బర్రెలక్క భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం వహరించవద్దని బర్రెలక్క డిమాండ్‌ చేసింది.

గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటింపు, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, జీవో 46 రద్దు వంటి పలు కీలక డిమాండ్లతో టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు.

30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్‌’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించారు.. వారికి మద్దతుగా నిలిచిన బర్రెలక్కను, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button