KhammamPoliticalTelangana

అర్ణవ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు స్థానిక కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలి… జిల్లా పంచాయతీ అధికారి వినోద్ కుమార్

సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం, అక్టోబర్ -27

అర్ణవ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా, అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి జి. వినోద్ కుమార్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎవరికీ సెలవులు అనుమతించబడవని స్పష్టం చేశారు.

లోతట్టు ప్రాంతాలు, పాత మట్టి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను గుర్తించి, అవసరమైన సందర్భాల్లో ముందస్తుగా సురక్షిత భవనాలకు తరలించాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లోని తాగునీటి ట్యాంకులకు సూపర్ క్లోరినేషన్ చేయించాలని, మురుగునీటి కాలువలను తక్షణమే శుభ్రం చేయించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.

లైన్ డిపార్ట్‌మెంట్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. తహసీల్దార్లు, విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, విపత్తు ప్రతిస్పందన బృందాలు తదితర శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, ఆయా శాఖల సిబ్బందికి క్షేత్రస్థాయిలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

తెగిపడిన తీగలు, విరిగిన చెట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉంటూ, ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button