EducationPoliticalTelangana

తాతకు తగ్గ మనుమరాలు త్రిషాతి

తాతకు తగ్గ మనుమరాలు త్రిషాతి

తాతకు తగ్గ మనుమరాలు త్రిషాతి

సంవత్సరానికి 48 లక్షలతో అడోబీ సంస్థలో జాబ్ సాధించిన వ్యాల త్రిషాతి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య ఆగస్టు 19

ప్రముఖ అమెరికన్ అడోబి కంపెనీలో 48 లక్షల ప్యాకేజీ తో జాబ్ ను వ్యాలా త్రిషాతి సాదించడం గర్వకారణం అని మఠంపల్లి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్రిషాతి మఠంపల్లి మండల కేంద్రంలోని వివి హై స్కూల్ పాఠశాల రిటైర్డ్ లెక్కలు మాస్టారు గండ్రాతి జనార్దన్ రెడ్డి మనుమరాలు కావడం మరో విశేషం ఆమె నర్సరీ నుండి ఒకటవ తరగతి వరకు మఠంపల్లి లోని సెంట్ మేరీ పాఠశాలలో విద్యను అభ్యసించారు.

రెండవ తరగతి నుండి కరీంనగర్ లో ఇంటర్ వరకు చదివి ఎంసెట్లో ర్యాంకు సాధించి జి నారాయణమ్మ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆటానామస్ హైదరాబాద్ కాలేజీలో బిటెక్ సీ ఎస్ సీ లో అడ్మిషన్ పొంది నాలుగవ సంవత్సరంలో విద్యను కొనసాగిస్తుండగా కాలేజీ క్యాంపస్ లో ప్రముఖ అమెరికన్ అడోబి కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో త్రిషాతి అత్యంత ప్రతిభ కనబరచడం జరిగింది.

అందుకుగాను ఆ కంపిని సంవత్సరానికి 48 లక్షల ప్యాకేజీ త్రిషాతి పొందటం పట్ల కాలేజీ యాజమాన్యం కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేవు త్రిషాతికి మొట్టమొదలు విద్యకు తొలి మెట్టు అయిన మఠంపల్లి సెంట్ మేరీ పాఠశాల యాజమాన్యం మరియు ఉన్నత శిఖరాలకు ఆద్యం పోసిన జి నారాయణమ్మ కాలేజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లెక్కలు మాస్టారుగా జనార్దన్ రెడ్డికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఎంతగా ఉన్నాయో త్రిషాతి వల్ల అది ఇంకా రెట్టింపు అయిందని మండల ప్రజలు కుటుంబ సభ్యులు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లు త్రిషాతినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button