ManchiryalaPoliticalTelangana

ప్రేమ పేరుతో మోసం.. కానిస్టేబుల్ ఇంటి ముందు న్యాయపోరాటం

ప్రేమ పేరుతో మోసం.. కానిస్టేబుల్ ఇంటి ముందు న్యాయపోరాటం

ప్రేమ పేరుతో మోసం.. కానిస్టేబుల్ ఇంటి ముందు న్యాయపోరాటం

Web desc : మంచిర్యాల : ప్రేమించి మోసం చేశాడని ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు నిరసన. పండంటి బిడ్డతో ప్రియుని ఇంటి ముందు న్యాయపోరాటం చేస్తున్న మహిళ.

జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో అమానవి ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తల్లిని చేసి బిడ్డ పుట్టిన తర్వాత ముఖం చాటేసిన ప్రియుడు.

జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామానికి చెందిన సోతుకు సాయిరాజ్ అదే గ్రామానికి చెందిన నీలిమ గత కొన్ని ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియురాలు నీలిమ గర్భవతి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరింది.

ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి శారీరకంగా వాడుకొని ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తనను వదిలేసాడంటూ ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు న్యాయపోరాటం చేస్తుంది. ప్రస్తుతం సాయిరాజ్ ఏఆర్ కానిస్టేబుల్ గా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు.

బాధిత మహిళ ప్రియుని ఇంటి వద్ద నిరసన చేస్తుండగా ఇంటికి తాళం వేసి ఇంటిలో నుండి హుటాహుటిన వెళ్లిపోయిన ప్రియుని కుటుంబ సభ్యులు. సాయి రాజ్ కు ఉద్యోగం రావడంతోనే తనను వదిలేసాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత మహిళ. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయగలరని వేడుకుంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button