
కుషాయిగూడ PS పరిధి లో వివాహిత ఆత్మహత్య
ఫిర్యాదుదారుడు శ్రీ రాజేందర్ సింగ్ R/o బీదర్, కర్ణాటక తెలిపిన వివరాల ప్రకారం ఆయన కుమార్తె ఐన సోనం ఠాకూర్ (వయస్సు సుమారు 26 సంవత్సరాలు) ని ఠాకూర్ యోగేష్ R/o ఇందిరా నగర్, మౌలాలి అనే వ్యక్తి కి ఇచ్చి 2020 లో వివాహం చేసారు. వివాహానంతరం వారు మౌలాలి, హెచ్‌బీ కాలనీ పరిధిలో నివసిస్తున్నారు. వారికి ఒక కుమార్తె.
కాగా తేదీ 20.04.2026 రోజున సాయంత్రం సుమారు 04:00 గంటల సమయంలో, ఫిర్యాదుదారుడు తన కుమార్తెకు పలుమార్లు ఫోన్ చేయగా స్పందన రాకపోవడంతో, పక్కింటి నివాసి భారతేశ్వరమ్మ ని సంప్రదించారు. ఆమె ఇంటికి వెళ్లి చూడగా, సోనం ఠాకూర్ బెదురూమ్ లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఉండగా గమనించారు.
వెంటనే ఆమెను కిందకు దించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే భర్త యోగేష్ మరియు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి కి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.



