
నారాయణఖేడ్ మున్సిపల్ 4 కో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కైవసం
మే (04) సి కె న్యూస్ అబ్దుల్లా ఉస్మాన్ నారాయణఖేడ్ జిల్లా సంగారెడ్డి. ఈరోజు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల్లో నాలుగు కోఆప్షన్ మెంబర్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ కి స్పందించిన కౌన్సిలర్లు ఏకాభిప్రాయంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారు 01)మైనార్టీ BC-E )-మొహమ్మద్ అబ్దుల్ కయుం(ముంతాజ్ సెట్) 02)కురుమ BC-B):నర్సు గోండ
03)మైనారిటీ BC-E )అర్ఫిన్ సుల్తాన్ మహమ్మద్ అబ్దుల్ మోహిజ్ 04) వీరశైవ లింగాయత్ BC-D) శెట్టి రేష్మ శెట్టి శంకర్ ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా హాజరైనటువంటి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్స్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ అభివృద్ధిలో మీయొక్క సలహాల్లో కీలకంగా వ్యవహరించాలని వారికి తెలియజేశారు.రాబోయే కాలంలో నారాయణఖేడ్ మున్సిపల్ ను అన్ని రకాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ శేట్కర్,వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కౌన్సిలర్లు బాణాపురం రాజు,రుక్మిణి గోపాల్ రెడ్డి,మహేష్ చౌహన్,షారుఖాన్, సజియ తరుణం MA సుబుర్,ఫర్హాన బేగం మైతాబ్, వివేకానంద,సురేఖ,లక్ష్మణ్, విజయ్ బుజ్జి,నజీబ్,పి.రామ కృష్ణ మరియు మున్సిపల్ ముక్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




