
ఫాదర్స్ డే సందర్భంగా చిన్నారులకు బట్టలు పండ్లు పంపిణీ చేసిన తెలంగాణ హ్యూమన్ రైట్స్ చైర్ పర్సన్ వ్యాసభట్టు శ్రీవాణి
హైదరాబాద్ జూన్ 23(సికే న్యూస్):
ఫాదర్స్ డే సందర్భంగా తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం చైర్ పర్సన్ వ్యాసభట్టు శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో చిన్నారులకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండ్రి కుటుంబానికి వెన్నుముక లాంటి వారని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ సమాజంలోని నిరుపేద చిన్నారులకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొని చిన్నారులతో ఆప్యాయంగా గడిపారు. పిల్లలకు నూతన వస్త్రాలు పండ్లు అందజేసి వారి ముఖంలో చిరునవ్వులు నింపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, అవసరమైన వారికి చేయూతను అందించాలని ఈ సందర్భంగా శ్రీవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.




