
గోదావరిలో దూకిన మహిళ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బ్రిడ్జి పైనుంచి ఓ మహిళ బుధవారం గోదావరిలోకి దూకింది. అదే సమయాన గోదావరిలో చేపలు పడుతున్న జాలర్లు ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు.అనంతరం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఆమె వివరాలు ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో నిర్ధారణ కాలేదు. ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయిందా లేక మద్యం మత్తులో ఉందా అన్నది తేలాల్సి ఉంది.
కాగా, సదరు మహిళ బ్రిడ్జిపై కాసేపు తచ్చాడి దూకే క్రమాన కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుండగా, సమీపంలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.




