
ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. దుకాణాలు, కార్యాలయాలు మూసివేత
Web desc : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‍తో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. గురువారం సాయంత్రం జంతర్ మంతర్ వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మరో వైపు ఆందోళనల నేపథ్యంలో దుకాణాలు హోటల్స్, కార్యాలయాలను అన్నింటిని సాయంత్రం 6 గంటలకే మూసివేయాలనే ఆదేశాలతో యజమానులు తమ దుకాణాలను మూసివేశారు.
ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ సూచన మేరకు కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలు, వ్యాపారాలు బంద్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకే అన్నీ మూసివేయాలని ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ షాప్ ఓనర్లు, కార్యాలయ ఇన్ చార్జులకు ట్రేడర్స్ అసోసియేషన్ సర్క్యూలర్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో యజమానులు తమ వ్యాపారాలను క్లోజ్ చేశారు. మరో వైపు ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లు మూసివేసినట్లు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఈ స్టేషన్లు పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయని పేర్కొంటున్నారు.




