HyderabadPoliticalTelangana

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా…

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా…

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా…

web desc : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిన సంఘటన గురువారం పఠాన్ చెరులోని నాయికోటి బస్తీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని అదుపులోకి తీసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలోనే ఈ వ్యవహారంపై మియాపూర్ స్టేషన్ లో కేసు అయిందని దీంతో అక్కడే తేల్చుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నందున ఇక్కడ ఏం చేయలేమని పంపినట్లు తెలిపారు.

బాధితురాలు అరుణ అందించిన వివరాల ప్రకారం లింగంపల్లిలోని ఓ క్లినిక్‌లో పరిచయమైన శ్రవణ్.. తనను 3 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో మోసం చేశాడని పెళ్లి ప్రస్తావన చేస్తే వద్దు అంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తాను 7 నెలల గర్భవతినని యువతి అరుణ ఆరోపించింది. అందుకే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్‌చెరులోని శ్రవణ్ నివాసం ముందు నిరసన చేపట్టినట్లు తెలిపింది.

నాకు డబ్బులు అవసరం లేదు ప్రియుడే కావాలి.. బాధితురాలు అరుణ.. ఎన్నో రోజులుగా మేము ప్రేమించుకున్నాం. చివరికి తనతోనే గర్భం దాల్చాను కాగా, తనకు ఎలాంటి డబ్బు అవసరం లేదని, తనకు శ్రవణ్ మాత్రమే కావాలని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేస్తారని ఆశించి వచ్చినా ఫలితం లేకపోయిందని వాపోయింది. అలాగే తనను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని మీడియా ప్రతినిధులను వేడుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button