
భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం…
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఎమ్మెల్యే కారు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా ప్రాంగణంలో డిసిఎంను దాటే క్రమంలో కారు పక్క నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు సైడ్ మిర్రర్, డోర్ దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే, ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు విచారణ చేపట్టారు.




