
నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న యువతులు… సోషల్ మీడియాలో వీడియో వైరల్
Web desc : సోషల్ మీడియా రీల్స్ విషయంలో వివాదం చోటు చేసుకొని యువతులు నడిరోడ్డుపై కొట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఈ షాకింగ్ సంఘటన సిలికాన్ సిటీ బెంగళూరు లోని ప్రసిద్ధ కబ్బన్ పార్క్ సమీపంలో చోటు చేసుకుంది.
వైరల్ వీడియలో ఇద్దరు యువతులు నడిరోడ్డుపై పరస్పరం దాడులకు దిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా రీల్స్ (Instagram Reels) చిత్రీకరణ విషయమై ఇద్దరి మధ్య మొదట చిన్నపాటి మాటా మాటా పెరిగింది.
ఆ వివాదం క్షణాల్లో ముదిరి తీవ్ర ఘర్షణకు దారితీయడంతో, ఇద్దరు యువతులు బహిరంగంగానే జుట్టు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ దాడి చేసుకున్నారు. రద్దీగా ఉండే రహదారిపై వీరిద్దరూ ఒకరినొకరు నెట్టేసుకుంటూ ఘర్షణ పడుతుండగా.. పక్కనే ఉన్న స్థానికులు, తోటి స్నేహితులు వారిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ గొడవను తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ దృశ్యాలు కాస్త నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.




