EntertainmentHyderabadPoliticalTelangana

బహిరంగంగా తప్పు ఒప్పుకున్న ఈశ్వర్ సాయి.!

బహిరంగంగా తప్పు ఒప్పుకున్న ఈశ్వర్ సాయి.!

బహిరంగంగా తప్పు ఒప్పుకున్న ఈశ్వర్ సాయి.!

web desc : ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి ఇటీవల వేములవాడలోని రెడ్డి భవన్లో తన తోటి డాన్సర్ మాధురి రాథోడ్ తో గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్గా కొంతమందితో కలిసి వీరిని పట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా , పెళ్లయి కొడుకు ఉన్న ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్ తన వైపు తిప్పుకుందని ఆరోపిస్తూ.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది శరణ్య.

అక్కడితో ఆగకుండా తన భర్త మంచివాడని, మాధురి రాథోడ్ వల్లే తన భర్త అలా అయ్యారు అంటూ మీడియా ముందు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక దీంతో వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో మాధురి రాథోడ్ కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా.. తనపై తప్పుడు కథనాలు వల్లిస్తూ తనను దారుణంగా హింసించి కొట్టారు అంటూ మాధురి రాథోడ్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.

తప్పు ఒప్పుకున్న ఈశ్వర్ సాయి.. ఇలా గత మూడు నాలుగు రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా.. తాజాగా ఈ విషయంపై ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి స్పందించారు. తప్పు నాదే అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. “భార్య ఉండగా మరొక అమ్మాయితో ఉండడం నిజంగా నేను చేసిన తప్పే. కానీ ఒత్తిడి వల్లే ఇలా జరిగిపోయింది” అంటూ తన తప్పు ఒప్పుకున్నారు ఈశ్వర్ సాయి. ప్రస్తుతం ఈశ్వర్ సాయి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మీడియా ముందుకు వచ్చిన ఈశ్వర్ సాయి భార్య..

ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. మీ భర్త చేసిన పనికి విడాకులు ఇస్తున్నారా? అని అడగగా.. ఆమె మాట్లాడుతూ “నేను విడాకులు ఎందుకు ఇవ్వాలి? నా భర్తను నేను వదులుకోను.. ఇరువర్గాలు కూర్చొని.. అన్ని సెటిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవు. అనవసరంగా మా గురించి మాట్లాడడం ఆపేయండి.

మా పెళ్లి జరిగి ఏడేళ్లు అవుతోంది. మా ఆయన చాలా మంచివారు. అసలు తప్పు ఆయన వైపు లేదు.. మా కాపురం గురించి ఎవరూ కూడా తప్పుడు వార్తలు సృష్టించవద్దు” అంటూ మీడియాని, సోషల్ మీడియా యూజర్లను ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మాధురి రాథోడ్..

ఇదిలా ఉండగా ప్రముఖ ఫోక్ డాన్సర్ ,బాధితురాలు మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు తనపై దాడి చేసిన కొంతమంది పై వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తనను దూషించడమే కాకుండా తనపై దాడి చేశారంటూ ఆరోపించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button