EntertainmentHyderabadPoliticalTelangana

మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు...'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్రమాదం..

మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు...'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్రమాదం..

మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు…’టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్రమాదం..

web desc : ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిన్న (శనివారం) జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం మధ్యలో ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్థంభం కిందపడిపోయింది. స్థంభం పై పడటంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందగానే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేల సంఖ్యలో అభిమానులు తరళి వచ్చారు. హీరో యాష్ అభిమానులను ఉద్దేశించి , వాళ్ళ కెరీర్స్ బాగుండాలంటూ , మొదటి 7 నిమిషాలు , కేవలం వాళ్ళ కోసమే కేటాయించారు.

సినిమా హీరోల కోసం ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోకండి , మేము పెద్దగా మీకు ఏమి చెయ్యలేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. దాదాపుగా 24 నిమిషాలు ఆయన ప్రసంగిస్తే , ఎక్కువ శాతం తెలుగు లోనే మాట్లాడడం విశేషం. ఎన్నో ఏళ్ళ నుండి మనం కొంత మంది తమిళ హీరోలను ఆదరిస్తున్నాము. వాళ్లలో చాలామందికి ఇప్పటికీ తెలుగు రాదు. ఉదాహరణకు సూర్య నే తీసుకుందాం.

తెలుగు ప్రేక్షకులు ఇతని పై ఎలాంటి అభిమానం చూపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఇప్పటి వరకు ఆయన తెలుగు నేర్చుకోలేదు , కనీసం ప్రయత్నం కూడా చెయ్యలేదు. కానీ యాష్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం గా స్వచ్ఛమైన తెలుగు లో మాట్లాడాడు.

ఒక్క కన్నడ హీరో అయ్యుండి , తెలుగు కి గౌరవం ఇస్తూ ఆయన మాట్లాడిన ప్రతీ మాట అభిమానుల మనసుల్లోకి దూసుకెళ్లింది. యాష్ పై మరింత గౌరవం , అభిమానం పెంచేలా చేశాయి. అయితే ఆయన ప్రసంగం ఇస్తున్న సమయం లో దురదృష్టం కొద్దీ ఒక ప్రమాదం జరిగింది. యాష్ ని చూసేందుకు ఆడియో బాక్సులు అమర్చిన టవర్స్ ని ఎక్కారు అభిమానులు. అవి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తో అభిమానులు పడిపోయారు.

ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అవ్వడంతో వెంటనే హాస్పిటల్ కి తరళించారు. ఈ సంఘటన జరగడం తో యాష్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి , ఎలా ఉన్నారు , జాగ్రత్త గా చూసుకోండి అంటూ సిబ్బందికి చెప్పడం , ఆ తర్వాత టవర్స్ ఎక్కిన అభిమానులను క్రిందకు దిగండి అని బ్రతిమిలాడడం, నెటిజెన్స్ కి యాష్ పై మరింత గౌరవం పెంచేలా చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button