Khammam
Trending

ఆచూకీ లేని అడుగుజాడను టెక్నాలజీతో పట్టేసిన ఖాకీ

ఆచూకీ లేని అడుగుజాడను టెక్నాలజీతో పట్టేసిన ఖాకీ

ఆచూకీ లేని అడుగుజాడను టెక్నాలజీతో పట్టేసిన ఖాకీ

కారేపల్లి: మూడు నెలలుగా కనిపించని యువతి ఆచూకీ.. కుటుంబ సభ్యుల ఆవేదన..ఫోన్ కూడా లేకపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారిన కేసు. అయినా వెనక్కి తగ్గలేదుకారేపల్లి పోలీసులు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని పదునైన దర్యాప్తు ఆలోచనతో మేళవించి,చివరకు యువతి ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.ఈ కేసులో సీఐ నునావత్ సాగర్ పర్యవేక్షణలో ఎస్‌ఐ బైరు గోపి చూపిన చొరవ, పట్టుదల పోలీసు దర్యాప్తులో సాంకేతికతకు ఉన్న శక్తిని మరోసారి చాటింది. కారేపల్లి మండలంలోనిబళ్లునగర్‌తండాకు చెందిన యువతి అదృశ్యమైన విషయమై ఆమె తల్లిదండ్రులు గత “మే”నెలలో కారేపల్లి పోలీసులను ఆశ్రయించారు.యువతి వద్ద ఫోన్ లేకపోవడంతో సాధారణ దర్యాప్తుతో ఆచూకీ తెలుసుకోవడం అంత సులభం కాలేదు.అయితే కేసును సవాల్‌గా స్వీకరించిన ఎస్‌ఐ బైరు గోపి అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం సాధనంగా కాకుండా దర్యాప్తులో కీలక ఆయుధంగా మలిచిన ఎస్‌ఐ గోపితన అనుభవంతో ఆధారాలను అనుసంధానిస్తూ యువతి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో నెలలుగా మిస్టరీగా ఉన్న మిస్సింగ్ కేసుకు తెరపడింది.దర్యాప్తులో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన హైదరాబాద్‌కు చెందిన రుకుమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించగా, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
టెక్నాలజీపై పట్టు.. కేసు ఛేదించడంలో పట్టుదల

ఎస్‌ఐ బైరు గోపి పనితీరులో ప్రధానంగా కనిపించిన రెండు అంశాలు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, కేసు పరిష్కారం కోసం చూపిన పట్టుదల.ఫోన్ లేకపోవడం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ దర్యాప్తును ఆపకుండా, అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను సమర్థంగా ఉపయోగించి ఆచూకీని గుర్తించడం ఆయన పనితీరుకు నిదర్శనం.ఒక కుటుంబానికి నెలల తరబడి ఉన్న ఆందోళనకు ముగింపు పలికి,అదృశ్యమైన యువతిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో ఎస్‌ఐ గోపి చూపిన చొరవ అభినందనీయం. ఇలాంటి దర్యాప్తు విజయాలు పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతాయి. కేసును ఛేదించడంలో చూపిన చాకచక్యం, సాంకేతికతను వినియోగించుకున్న తీరు పోలీసు శాఖలోని యువ అధికారులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తోంది. మున్ముందు మరిన్ని సవాల్‌భరిత కేసులను ఇదే దూకుడుతో ఛేదిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఎస్‌ఐ బైరు గోపిని స్థానికులు అభినందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button