Andhra PradeshPolitical

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మ*హత్య

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మ*హత్య

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మ*హత్య

Web desc : కృష్ణ జిల్లా కంకిపాడు మండలం యనమలకుదురులో విజయవాడ సిటీ ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆర్లు రాజేశ్ మృతి చెందారు. 2009 బ్యాచ్‌కు చెందిన రాజేశ్ ప్రస్తుతం ఆర్డర్ టు సర్వ్‌పై కృష్ణా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. అదనపు డీజీ శ్రీ మధుసూదన్ రెడ్డి డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

అర్ధరాత్రి సమయంలో ఇంటి హాలులో ఫ్యాన్‌కు లుంగీతో ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన భార్య.. లుంగీని కట్ చేసే సమయంలో రాజేశ్ కిందపడిపోయారు. రాజేశ్ కిందపడి తల వెనుక భాగంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం జరిగినట్లు సమాచారం.

చికిత్స అందించేలోపే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రాజేశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇతర కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button