
కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు..
తెలంగాణ రాజకీయాల్లో బిగ్ షాక్..
Web desc : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సహా నలుగురు బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసును నమోదు చేశారు.
ఇటీవల తెలంగాణ శాసనసభ గేటు ముందు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న తన పట్ల సదరు నేతలు అభ్యంతరకరంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని ఓ మహిళా కానిస్టేబుల్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్, హరీశ్ రావు తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ : అసెంబ్లీ సమావేశాల వేళ ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ మధ్య పోటాపోటీ రాజకీయం నడుస్తోంది.
అసెంబ్లీ ప్రారంభం నాడే బీఆర్ఎస్ నేతలు నల్లటి దుస్తువులు ధరించి అసెంబ్లీకి రావడం పట్ల దుమారం చెలరేగింది. ఆ తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ చావుడప్పుల కార్యక్రమం నిర్వహించగా ఆ తర్వాత అక్కడ బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ అంశంపై ఇంకా రాజకీయం చల్లారకముందే తాజాగా బీఆర్ఎస్ లో కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావుతో సహా మరో ఇద్దరిపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ పరిణామంతో స్టేట్ పాలిటిక్స్ ఏ రకంగా ఉండబోతున్నాయని ఉత్కంఠ రేపుతోంది.




