HyderabadPoliticalTelangana

మద్యం మత్తులో ఓ యువతి, యువకుడు వీరంగం..

మద్యం మత్తులో ఓ యువతి, యువకుడు వీరంగం..

మద్యం మత్తులో ఓ యువతి, యువకుడు వీరంగం..

బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం, పోలీసుల అదుపులో
సిటీలో డ్రైవర్ చేసేవారు జాగ్రత్త అని పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడ మైక్‌లో ప్రకటనలు ఇస్తున్నారు. అయినా సరే అవేమీ పట్టించుకోలేదు కొందరు యువతీ యువకులు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ సిటీలో చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 14లో యువతీ, యువకుడు కారుతో వీరంగం సృష్టించారు. వోక్స్‌ వ్యాగన్ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేశారు.

వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీ కొట్టారు యువతీయువకుడు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

రంజనా రాయ్ అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలియగానే బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారుతోపాటు యువతీయువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button