
పాతర్లపాడులో డీజే సీజ్
అనుమతులు లేకుండా డీజే నిర్వహణ.. చింతకాని పోలీసుల చర్యలు
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
సెప్టెంబర్ 19,చింతకాని: చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డీజే సౌండ్‌ను చింతకాని పోలీసులు సీజ్ చేశారు. వినాయక ఉత్సవాల సందర్భంగా డీజే సౌండ్స్‌కు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని, అనుమతులు లేకుండా డీజే నిర్వహించడం చట్టవిరుద్ధమని చింతకాని సబ్ ఇన్‌స్పెక్టర్ జి. నరేష్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో డీజే సౌండ్స్‌ను నియంత్రించాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
అనుమతులు లేకుండా డీజేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్‌ఐ నరేష్ హెచ్చరించారు. వినాయక ఉత్సవాలను ప్రజలంతా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. మండలంలో డీజే సౌండ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చర్యలు తీసుకుంటున్న ఎస్‌ఐ జి. నరేష్‌ను పలువురు మండల ప్రజలు అభినందిస్తున్నారు.




