HyderabadPoliticalTelanganaWarangal

క్యాబ్‌ డ్రైవర్‌తో మెడికో ప్రేమాయణం.. లాడ్జిలో విగతజీవిగా!

క్యాబ్‌ డ్రైవర్‌తో మెడికో ప్రేమాయణం.. లాడ్జిలో విగతజీవిగా!

Web desc : హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌లో ఓ వైద్య విద్యార్థిని లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వరంగల్‌లో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న సృజన.. మూడు రోజుల కిందట క్యాబ్‌ డ్రైవర్‌ రవితో కలిసి మియాపూర్‌లోని ఓ లాడ్జిలో దిగినట్లు సమాచారం.

ప్రస్తుతం సృజన మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రవి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మియాపూర్‌ ఎస్‌హెచ్‌వో జయరాం తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌కు చెందిన కోమటి భూమయ్య రెండవ కుమార్తె కోటమి సృజన(27) మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ వైద్య విద్యను పూర్తిచేసుకుని వరంగల్‌ హనుమకొండలో పీజీ చేస్తోంది.

హనుమకొండలో తన స్నేహితులతో కలిసి ఉంటూ ఓ ఆస్పత్రిలో పీడియాట్రీషన్‌గా పనిచేస్తోంది. సృజన మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న సమయంలో మహబూబ్‌నగర్‌ అమరచింతల్‌కు చెందిన క్యాబ్‌డ్రైవర్‌ రవి కుమార్‌(30)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా రవికుమార్‌ సరిగ్గా పనిచేయకుండా జులాయిగా తిరుగుతూ అప్పులు చేశాడు.

అప్పులు తీర్చుతానని చెప్పి సృజన వద్ద నుంచి బంగారం తీసుకున్నాడు. బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పి రవికుమార్‌ గతనెల 29న తన స్నేహితుడుతో కలిసి మియాపూర్‌ న్యూ హఫీజ్‌పేటలోని మార్తాండనగర్‌లోని గ్రాండ్‌ బ్రోహోలిక్‌ లగ్జరీ హోటల్‌లో రూమ్‌ తీసుకున్నారు. ఆ రాత్రి ఉన్న స్నేహితుడు మరుసటి రోజు వెళ్లిపోయాడు.

అదేరోజు సృజనకు ఫోన్‌ చేసి మాట్లాడుకుందామని.. బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పి హైదరాబాద్‌కు రమ్మన్నాడు. దీంతో సృజన 30న హైదరాబాద్‌ వచ్చి రవికుమార్‌తోపాటు హోటల్‌కు వెళ్లింది. ఆరోజు రాత్రి వారి మధ్య గొడవ జరిగి ఉంటుందని, నిద్రిస్తున్న సమయంలో సృజనను రవికుమార్‌ హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో బంగారు ఆభరణాలు తీసుకురావడానికి హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పిందని, ఫోన్‌ చేసినా స్పందించడం లేదని స్నేహితులు సృజన తండ్రి భూమయ్యకు చెప్పడంతో ఆయన హనుమకొండలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా మార్తాండనగర్‌ కాలనీలో ఉన్నట్లు గుర్తించారు.

దీంతో శుక్రవారం హనుమకొండ పోలీసులు మియాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా హోటల్‌ గది బయటనుంచి తాళం వేసి ఉంది. మరో తాళంతో తలుపులు తెరిచి చూసేసరికి సృజన బెడ్‌పై విగతజీవిగా పడిఉంది.

సీసీ కెమెరాలు పరిశీలించగా సృజనతో పాటు రవికుమార్‌ కూడా వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. రవికుమార్‌ సృజనను హత్యచేసి పరారై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని మియాపూర్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button