Andhra PradeshEducationPolitical

బీసీ హాస్టల్‌ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం

బీసీ హాస్టల్‌ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం

బీసీ హాస్టల్‌ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం

భయంతో స్పృహ కోల్పోయిన బాలిక

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోక్సో కేసు నమోదు

Web desc : అతను డీఆర్‌డీఏలో పనిచేసి రిటైరైన ఉద్యోగి. ప్రకాశం జిల్లాలోని బీసీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్థినులపై కన్నేశాడు. అప్పటికే పరిచయం ఉన్న హాస్టల్‌ వంట మనిషి సహకరించింది. బాలికలకు మాయమాటలు చెప్పి వంట మనిషి ఇద్దరు బాలికలను అతని ఇంటికి తెచ్చింది.

తాత వయసున్న ఆయన ఒక బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. మరో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, ఊరిలోని వారికి చెప్పడంతో ఆ కామాంధుడి గుట్టు రట్టయింది. చంద్రబాబు కూటమి పాలనలో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు రక్షణ లేదనడానికి ఇది మరో ఉదాహరణ.

అధికారులు, బాధితుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక జరుగుమల్లిలోని బీసీ బాలికల హాస్టల్‌లో ఉంటూ అక్కడి హైస్కూలులో పదో తరగతి చదువుకుంటోంది. ఇటీవల ఆ బాలిక తండ్రి చనిపోయాడు. దినం రోజున హాస్టల్‌లో పనిచేసే వంట మనిషి శారదను కూడా బాలిక ఆహ్వానించింది. తరువాత రెండో రోజు హాస్టల్‌కు వెళ్లిన బాలికతో ఒంగోలులో తనకు తెలిసిన ఒకాయన దగ్గరకు వెళ్తే డెత్‌ సర్టిఫికెట్‌ ఇప్పిస్తారని శారద నమ్మబలికింది.

తాను ఒక్కదాన్నే రాలేనని, అదే స్కూలులో 8వ తరగతి చదివే తమ ఊరికి చెందిన మరో బాలికతో కలిసి వస్తానని ఆ బాలిక చెప్పింది. దాంతో వంటమనిషి ఆ ఇద్దరు మైనర్‌ బాలికలను మంగళవారం మధ్యాహ్నం ఒంగోలుకు తీసుకొచ్చి, గోపాల్‌ నగర్‌ మొదటి లైనులో పుట్ట చెట్టు వద్ద ఉన్న డీఆర్‌డీఏ రిటైర్డ్‌ ఉద్యోగి బట్టు వెంకటరావు ఇంటికి తీసుకొచ్చింది. ఇద్దరు విద్యార్థినులను చెరో గదిలో కూర్చోబెట్టి వెంకటరావుతో కలిసి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రం 6 గంటల సమయంలో వెంకటరావు ఒక్కడే వచ్చాడు.

తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను 8వ తరగతి బాలికకు ఇచ్చి చూస్తుండమని చెప్పి బెడ్‌రూంలోకి వెళ్లాడు. అక్కడ టవల్‌ కట్టుకొని వచ్చి 10వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో భయపడిన ఆ బాలిక కేకలు వేసి, స్పృహ తప్పి పడిపోయింది. ఇది గమనించిన 8వ తరగతి బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి చెప్పింది. భయంతో బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారికి చెప్పింది. దాంతో స్థానికులు 112కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వెంకటరావును అదుపులోకి తీసుకున్నారు.

ఈలోపు బాలిక కుటుంబ సభ్యులు కూడా అక్కడకు వచ్చారు. స్పృహ తప్పి ఉన్న 10వ తరగతి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లారు. బట్టు వెంకటరావుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు టూ టౌన్‌ సీఐ వీరనాయక్‌ తెలిపారు. హాస్టల్‌ వార్డెన్‌ తేరేజమ్మ, వంట మనిషి శారదను ఒంగోలు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో విచారించారు.

జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి నిర్మలాజ్యోతి, జరుగుమల్లి మండల తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు హాస్టల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడానని, వారిపై లైంగిక దాడి జరగలేదని నిర్మలాజ్యోతి చెప్పారు. వంట మనిషి చెప్పటంతో విద్యార్థినులు మంగళవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో వెంకటరావు ఇంటికి ఆటోలో వెళ్లారని చెప్పారు. వంట మనిషిని సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వంట మనిషి శారద తీరుపై అనుమానాలు భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్న వెంకటరావుకు వంట మనిషి శారదతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. శారద తనకు తెలిసిన బాలికలను మాయమాటలతో ట్రాప్‌ చేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

తాళ్లూరు హాస్టల్‌ వార్డెన్‌ తేరేజమ్మ జరుగుమల్లి హాస్టల్‌కు కూడా ఇన్‌చార్జి వార్డెన్‌గా బాధ్యతలు చూస్తున్నారు. దీంతో హాస్టల్‌లో వంట మనిషి శారద విద్యార్థినులను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button