PoliticalSanga reddyTelangana

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.9 లక్షల నష్టం.. యువకుడి ఆత్మ*హత్య

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.9 లక్షల నష్టం.. యువకుడి ఆత్మ*హత్య

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.9 లక్షల నష్టం.. యువకుడి ఆత్మ*హత్య

సంగారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఓ యువకుడి జీవితాన్ని విషాదంగా మార్చింది. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ (23) అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలలుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న శ్రీకాంత్.. సుమారు రూ.9 లక్షల వరకూ నష్టపోయినట్లు సమాచారం.

దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. మానసికంగా కూడా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి గమనించడంతో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న గుమ్మడిదల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీకాంత్ బెట్టింగ్‌లకు అలవాటు పడటం.. అందులో భారీగా డబ్బు నష్టపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా యువకుడు ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button