PoliticalTelanganaWarangal

హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు

హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు

హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు

Web desc : వరంగల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఎస్సై రాజ్‌ కుమార్‌తో తనకు ప్రాణహాని ఉందని హనుమకొండకు చెందిన ఎం. పూర్ణిమ ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. నాలుగేళ్లుగా లైంగిక దాడి, శారీరక, మానసిక హింస, వివాహం పేరుతో మోసం, కుల వివక్షతో కూడిన అవమానకర దూషణలు, ప్రాణభయ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

2018లో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు కొద్దిరోజుకే శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడంతో.. భరించలేక 2022 మార్చి4న హనుమకొండ పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎస్సైగా ఉన్న రాజ్‌ కుమార్‌ తన భర్తను పోలీసు స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించినప్పటికి అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

తనకు సాయం చేస్తానని చెప్పి ఎస్సై తనపై లైంగిక దాడికి పాల్పడి ఆపై నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్టు వాపోయా రు. అప్పటి నుంచి శారీరకంగా వేధిసూ్తనే ఉన్నారని ఆరోపించారు. తన కోసం నిలబడిన వారిపై కూడా అక్రమంగా కేసులు బనాయిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్నారని.. ఈ విషయంలో పోలీస్‌ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనను ఎస్సై రాజ్‌ కుమార్‌ నుంచి విముక్తి కల్పించాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button